Breaking News

దుమ్మును అడ్డుకునే దమ్ము

Published on Fri, 01/24/2025 - 05:07

హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ దీనికి ఓ విరుగుడును గుర్తించింది. దుమ్ము, వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించడంలో కొన్ని జాతుల వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా మర్రి జాతి చెట్లు అత్యంత సమర్థంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయని.. వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు సైతం కాలుష్య స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించింది. 

ఈ జాతుల చెట్లు దుమ్మును ఒడిసిపట్టుకోగలవని, గాలిలోని ధూళిని తట్టుకొని ఎదగగలవని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ పరిశోధన వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనను పంకజ్‌ సింగ్‌ (సైంటిస్ట్‌–డీ – పరిశోధన బృంద సమన్వయకర్త), భారతీ పటేల్‌ (సైంటిస్ట్‌–డీ – అటవీ జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు) నిర్వహించారు. 

జీవరసాయననమూనాలతో.. 
ఈ పరిశోధన కోసంహైదరాబాద్‌ శివార్లలో అధిక కాలుష్యం వెలువరించే పరిశ్రమలున్న దూలపల్లి, బొల్లారంపారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, మేడ్చల్‌ హైవే వెంబడి ఉన్న తుక్కుగూడ ప్రాంతంలోని పలు చెట్ల జాతుల నుంచి జీవరసాయన నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలనువిశ్లేషించగా వాటిలో మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయు కాలుష్య నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.

గ్రీన్‌బెల్ట్‌ విస్తరణకు దోహదం 
పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ప్రధాన హైవేల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్లుగా ఈ జాతుల మొక్కలను నాటడం ద్వారా సత్ఫలితాలను పొందొచ్చని సూచించారు. నగరంలో గ్రీన్‌ బెల్ట్‌ విస్తరణకు, వాయుకాలుష్యం నియంత్రణతోపాటు వడగాడ్పుల ప్రభావం తగ్గించేందుకు, మట్టి, శబ్ద, నీటి కాలుష్యం నివారణకు సైతం ఈ వృక్షాలు దోహదపడతాయనిపేర్కొన్నారు.

వాయు కాలుష్య తీవ్రతను సూచించే వరగోగు
వివిధ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రతను తెలియజేయడంలో వరగోగు (సొగసుల చెట్టు) జాతి చెట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. పారిశ్రామిక వ్యర్థాలు అధికంగా ఉండే చోట లేదా భారీ ట్రాఫిక్‌ ఉండే ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు రంగుమారడం, మాడిపోవడం కనిపిస్తుందనిపరిశోధకులు పేర్కొన్నారు.  
- సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)