Breaking News

తెలంగాణకు చేగువేరా కుమార్తె, మనవరాలు

Published on Sun, 01/22/2023 - 02:18

సాక్షి, హైదరాబాద్‌: క్యూబా విప్లవనేత చే గువేరా వారసులు ఆదివారం హైదరాబాద్‌కు రాను న్నారు. నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా(ఎన్‌సీఎస్‌సీ), ఐప్సో(ఏఐపీ ఎస్‌వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరగ నున్న క్యూబా సంఘీభావసభకు చే కుమార్తె, క్యూబా బాలల హక్కుల కార్యకర్త, అడ్వకేట్‌ అలైదాగు వేరా, ఆమె కుమార్తె, చే మనవరాలు ప్రొఫెసర్‌ ఎస్తిఫినా గువేరా హాజరుకానున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్న అలైదా, ఎస్తిఫినాకు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ క్యూబన్‌ ప్రతినిధి బృందంతో వారివురూ సమావేశమవుతారు. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞానకేంద్రం, మఖ్దూం భవన్, హరితప్లాజా, రవీంద్రభారతిని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్రభారతిలో జరగనున్న క్యూబా సంఘీభావ సభలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా వారు చేగువేరాతో తమ అనుభవా లను పంచుకోవడంతోపాటు చే సమరశీలత, ప్రజాస్వామిక చైతన్యానికి ప్రేరణ ఇవ్వనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వామపక్ష పార్టీల నేతలు ఎన్‌.బాలమల్లేశ్, డీజీ నర్సింహారావు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ కార్యక్రమా నికి అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు హాజరుకానున్నారు. రాత్రి హరితప్లాజాలోనే బసచేయనున్న అలైదా, ఎస్తిఫినా సోమవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్‌ విమానా శ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.    

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)