Breaking News

‘రింగు’లో 8 వరుసల వంతెనలు

Published on Wed, 04/23/2025 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను నాలుగు వరుసలకు బదులు ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మించాలని భావిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ.. ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్‌పాస్‌లున్న చోట మాత్రం 8 లేన్లతో రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. ప్రధాన క్యారేజ్‌వే (రోడ్డు) ఆరు వరుసలుగా నిర్మించటం ఖరారైతే, వంతెనలుండే చోట 8 వరసలుగానే నిర్మించనున్నారు. 

ఈ మేరకు అన్ని డిజైన్లు మారుస్తున్నారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచి ఉన్నందున, టెండర్‌ డాక్యుమెంటులో కూడా వివరాలను మారుస్తున్నారు. టెండర్‌ పిలిచేనాటికి నాలుగు వరసలుగా మాత్రమే రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆలోచన మారినందున, అదే టెండర్‌ను కొనసాగించాలా, కొత్త టెండర్‌ పిలవాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

55 మీటర్ల వెడల్పుతో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు 
» ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే చోట ఈ నిర్మాణాలుంటాయి. ఆయా రోడ్ల నుంచి రింగురోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆయా రోడ్లకు వాహనాలు మారేందుకు వీలుగా లూప్‌ రోడ్లను అనుసంధానిస్తారు. 
»  ఇవి కాకుండా 3 నదులపై భారీ ఫ్లైఓవర్లు ఉంటాయి. మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కి.మీ. నిడివితో, మంజీరా నది మీద పుల్కల్‌ మండలం శివ్వంపేట వద్ద 600 మీటర్ల నిడివితో, తూప్రాన్‌ వద్ద హరిద్రా నది(హల్దీవాగు) మీద 500 మీటర్ల పొడవుతో వంతెనలు నిర్మిస్తారు.  
»  చిన్న రోడ్లు, నీటి కాలువలు క్రాస్‌ అయ్యే 105 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. ఈ ప్రాంతంలో రోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది.  
»  చెక్‌డ్యామ్స్, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే కాలువలను క్రాస్‌ చేసే చోట్ల 85 కల్వర్టులుంటాయి. ఈ ప్రదేశాలన్నిటి వద్ద ప్రధాన రోడ్డు 8 వరుసలతో, 55 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు.

ఒక్కో లేన్‌ 5.31 మీటర్ల వెడల్పు 
ఒక్కోవైపు నాలుగు వరుసలతో మొత్తం ఎనిమిది వరుసలుగా ట్రిపుల్‌ ఆర్‌ ఉంటుంది. ఒకవైపు నాలుగు వరసలు కలిపి 21.25 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే ఒక్కో లేన్‌ 5.31 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ రెంటి మధ్య సెంట్రల్‌ మీడియన్‌ 12.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ కింద ఉండే రాష్ట్ర, జాతీయ రోడ్లను అనుసంధానించే లూప్‌లు ఒక్కోవైపు 7.5 మీటర్ల వెడల్పుతో ప్రారంభమవుతాయి. రెండు వైపులా కలిపి 15 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఈ లూప్‌లు ఉండే చోట మొత్తం రోడ్డు వెడల్పు ఏకంగా 70 మీటర్లు ఉండనుండటం విశేషం.  

150 ఎకరాల వైశాల్యంలో ఇంటర్‌ఛేంజ్‌ కూడలి 
ఉత్తర రింగులో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను ట్రిపుల్‌ ఆర్‌ క్రాస్‌ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. ఎనిమిది వరుసలతో నిర్మాణం చేపట్టాలని తాజాగా నిర్ణయించినందున ఈ స్ట్రక్చర్లు అతి భారీగా ఉండబోతున్నాయి. ఔటర్‌ రింగురోడ్డును కూడా 8 వరుసలతో నిర్మించినా, దానిమీద ఉండే ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్లు ఇంత భారీగా లేవు. ఓఆర్‌ఆర్‌ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతోనే నిర్మించారు. అయితే రీజినల్‌ రింగురోడ్డును ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీనిపై 120 కి.మీ.కు మించి వేగానికి అనుమతి ఉంటుంది. 

ప్రధాన క్యారేజ్‌వే నుంచి దిగువ రోడ్లలోకి మారేప్పుడు ఉండే లూప్‌ల మీద వాటి వేగం 60 కి.మీ. నుంచి 80 కి.మీ. వరకు ఉంటుంది. ఓఆర్‌ఆర్‌ లూప్స్‌లో వేగ పరిమితి 30 కి.మీ. మాత్రమే కావడం గమనార్హం. కాగా 60–80 కి.మీ వేగంలో మలుపు తిరగాలన్నప్పుడు లూప్‌ వ్యాసార్ధం ఎక్కువగా ఉండాలి. దీంతో ఈ లూప్‌లు కిలోమీటరున్నర దూరం నుంచే ప్రారంభమై వంపు తిరుగుతాయి. ఇందుకోసం ఒక్కో ఇంటర్‌ఛేంజ్‌ కూడలిని 120–150 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించనున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)