Breaking News

కులవివక్షను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం

Published on Sun, 11/02/2025 - 01:22

కవాడిగూడ/గన్‌పౌండ్రీ(హైదరాబాద్‌): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌.గవాయ్‌ మీద దాడి జరిగితే.. ఈ దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. జస్టిస్‌ బీఆర్‌.గవాయ్‌ మీద జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం సాయంత్రం 4 గంటలకు ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు వేలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని, ఆయన స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటే ఈ దాడి జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. అందువల్లనే ఈ దాడిని దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నామని చెప్పారు. ఇంత కులవివక్ష పాటించడం అత్యంత అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు..సుప్రీంకోర్టు సుమోటోగా కేసు ఎందుకు స్వీకరించలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మౌనంగా ఎందుకు ఉండిపోయింది అని ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆందోళన వ్య క్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ పోరాటం కేవలం ఆరంభం మాత్రమే.. ఇక జాతీయస్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 17న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితులను సమీకరించి దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మున్నంగి నాగరాజు మాదిగ ఎంఆర్‌పీఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్‌ పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)