Breaking News

ఇసుక రవాణా వాహనాలకు ‘కేంద్రీకృత వ్యవస్థ’

Published on Tue, 10/14/2025 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక వెలికితీత, విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇసుక వెలికితీత, రవాణాలో ఉపయోగించే వాహనాల జీపీఎస్‌ సమాచారాన్ని ఏకీకృతం చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆయా వాహనాలు జీపీఎస్‌ వ్యవస్థను అమర్చుకోవడాన్ని టీజీఎండీసీ ఇదివరకే తప్పనిసరి చేసింది. వేర్వేరు జీపీఎస్‌ ప్రొవైడర్ల ద్వారా ఈ వాహనాల్లో జీపీఎస్‌ పరికరాలను అమర్చారు. 

అయితే ఈ ప్రొవైడర్ల వద్ద ఉన్న వాహనాల కదలికల సమాచారం టీజీఎండీసీ వద్ద ఏకీకృతంగా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా, వెలికితీతలో నిమగ్నమైన వాహనాల వివరాలను తమ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయాలని జీపీఎస్‌ ప్రొవైడర్లను టీజీఎండీసీ ఆదేశించింది. 

రియల్‌ డేటాను పంచుకోవాలి 
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకం, నిలువ, విక్రయాల్లో సుమారు 40వేలకు పైగా యంత్రాలు, రవాణా వాహనాలు నిమగ్నమై ఉన్నాయి. వీటిలో 70శాతానికి పైగా వాహనాల్లో వివిధ జీపీఎస్‌ ప్రొవైడర్ల ద్వారా పరికరాలను అమర్చారు. టీజీఎండీసీ రూపొందించిన ఏపీఐతో అనుసంధానం చేయడం ద్వారా వాహనాల కదలికల (రియల్‌ టైమ్‌ డేటా) సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా కేంద్రీకృత వాహన పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలవుతుంది. 

అయితే ఇప్పటివరకు 8 వేల వాహనాల జీపీఎస్‌ డేటా మాత్రమే ఏపీఐతో అనుసంధానమైంది. ఈ నేపథ్యంలో మిగతా వాహనాల జీపీఎస్‌ సమాచారాన్ని కూడా ఏపీఐతో అనుసంధానం చేసేందుకు జీపీఎస్‌ ప్రొవైడర్లతో టీజీఎండీసీ సంప్రదింపులు జరుపుతోంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది. 

జీపీఎస్‌ లేని వాహనాల గుర్తింపు 
జీపీఎస్‌ వాహన పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇసుక రవాణాలో జీపీఎస్‌ పరికరాలను లేకుండా పాల్గొంటున్న వాహనాలను గుర్తించడం సాధ్యమవుతుందని టీజీఎండీసీ భావిస్తోంది. జీపీఎస్‌ డేటా ఏకీకృతం కాకపోవడంతో జరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీఐతో అనుసంధానమయ్యే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు, కో ఆర్డినేట్లు (అక్షాంశాలు, రేఖాంశాలు) తదితరాలను జీపీఎస్‌ ప్రొవైడర్లు అందజేయాల్సి ఉంటుంది.   

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు