Breaking News

రేపు తెలంగాణకు కేంద్ర బృందం.. నష్టాలపై నివేదిక!

Published on Sun, 07/30/2023 - 10:28

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదల నేపథ్యంలో పరిస్థితిని తక్షణమే అంచనా వేసేందుకు అమిత్‌షా ఆదేశాల మేరకు అంతర్‌–మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. 

ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివరణాత్మక నివేదిక కేంద్రానికి సమర్పిస్తుంది. అనంతరం అవసరమైతే కేంద్ర బృందం మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తుంది. 

కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రహదారుల శాఖలు, అంతరిక్ష విభాగంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణలో 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.  

ఇది కూడా చదవండి: ట్యాంక్‌ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లి.. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)