Breaking News

తెలంగాణ సీఎస్‌పై కేంద్రం సీరియస్‌

Published on Wed, 09/04/2024 - 14:57

సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్‌లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.

ఇక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్‌లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్‌ సర్టిఫిటెక్స్‌, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)