Telangana: ఇకపై ‘టీఎస్‌’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్‌ విడుదల

Published on Wed, 03/13/2024 - 07:29

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్‌‌ మార్క్‌ను టీఎస్‌ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కాగా, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్‌ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించినట్లు వెల్లడించింది. 

అయితే, గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ కేబినెట్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీఎస్‌ నుంచి టీజీగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా మంగళవారం రవాణా, రహదారుల శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకనుంచి రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీజీగా మారనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)