Breaking News

ఎస్సీ స్కాలర్‌షిప్‌లకు అందని కేంద్ర సాయం!

Published on Sat, 05/06/2023 - 10:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులకు కేంద్ర నిధులు అందడం లేదు. దీనికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. 

దీనితో గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన రూ.775 కోట్లు ఆగిపోయాయి. అంతేకాదు ఇలా నిలిచిన నిధులను తదుపరి ఏడాది ఇచ్చే (క్యారీ ఫార్వర్డ్‌) అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని.. అంటే భారమంతా రాష్ట్రంపై పడినట్టేనని అధికారులు చెప్తున్నారు. కేంద్ర నిధులు విడుదలకాక రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేత­నాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకు­పోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేయాల్సి రావడంతో విద్యార్థులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందంటున్నారు. 

నేరుగా ఇచ్చేందుకే కేంద్రం పట్టు..
ఎస్సీవర్గాల వారికి నేరుగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్ల కింద నిబంధన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం కాకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం.. నిర్దేశిత ఫార్మాట్‌ ప్రకారం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 

ఒకవేళ నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలను అందజేసినా.. ఉపకార వేతన దరఖాస్తులు స్వీకరించిన వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఆ ఫార్మాట్‌లో వివరాల సమర్పణకు, ఇతర నిబంధనలకు రాష్ట్రం అంగీకరించకపోవడం, వివరాలు పంపకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను ఆపేసింది. మూడేళ్లలో ఇప్పటివరకు రూ.775 కోట్లు ఇలా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థి ఖాతాలో జమచేస్తుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల ఖాతాలో జమ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి కొత్త పార్టీ.. పేరు అదేనా?

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)