Breaking News

ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Published on Mon, 07/10/2023 - 12:22

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే,  రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈట‌ల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. 

ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. 

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసానికి సీఆర్‌పీఎఫ్‌ అధికారులు చేరుకున్నారు.  కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్‌ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్‌ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.  భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్‌ వై ప్లస్‌ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్‌ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. 
చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్‌ ఫ్యామిలీని టార్గెట్‌ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)