Breaking News

‘చక్షు’కు చెప్పండి! 

Published on Fri, 03/22/2024 - 04:39

సాక్షి, హైదరాబాద్‌:    ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్‌ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ 

‘మీ వాట్సప్‌ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌ పొందండి..’’ 

‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్‌ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ 

రోజుకో కొత్త తరహా సైబర్‌ మోసం...సైబర్‌ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌.. లేదంటే ఎస్‌ఎంఎస్‌లు. సైబర్‌ నేరగాళ్లు వివిధ ఫోన్‌ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్‌ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మోసపూరిత ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్‌ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్‌ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్‌ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. 

ఏమిటీ చక్షు పోర్టల్‌?  
చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ అందిస్తున్న సిటిజన్‌ సెంట్రిక్‌ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్‌ సస్పెక్టెడ్‌ ఫ్రాడ్‌ కమ్యూనికేషన్‌’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్‌లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. 

చక్షు పోర్టల్‌ ఎలా వినియోగించాలి..  
♦ https://sancharsaathi.gov.in లింక్‌ ద్వారా సంచార్‌ సాథి పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
♦ సిటిజన్‌ సెంట్రిక్‌ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్‌ లేదా మెసేజ్‌ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి.
♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్‌ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది.  

ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు 
 ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు.
♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయడం, ట్రాక్‌ చేయడం చేయవచ్చు.  
♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)