Breaking News

హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!

Published on Thu, 04/03/2025 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. విద్యార్థుల నిరసనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. వారికి మద్దతుగా సినీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, భిన్న రంగాల ప్రముఖులు గొంతు కలుపుతున్నారు. దీనితో హెచ్‌సీయూ భూముల అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది. 

పర్యావరణ పరిరక్షణ కోసం..: హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా సినీహీరో రాంచరణ్‌ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘‘జంతువులు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? మనం చెట్టును ఎక్కడ తిరిగి నాటుతున్నాం? దీనిపై మీ భవిష్యత్తు ప్రణాళికను పంచుకోండి. అటవీ ప్రాంతాన్ని నిర్మూలించిన తర్వాత ఏం చేయబోతున్నారు’అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టారు. ప్రముఖ నటి సమంత కూడా ఈ అంశంపై స్పందించారు. 

గచ్చిబౌలిలో జీవవైవిధ్యమున్న భూమిని ధ్వంసం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటూ.. పర్యావరణ ప్రభావాలపై ఓ ఆంగ్లపత్రిక నివేదికను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు అండగా నిలుస్తాను. భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ నిరసన తెలపాలి’’అని పిలుపునిచ్చారు. 

ఇక.. ‘‘పర్యావరణ భవిష్యత్తు కోసం విద్యార్థులు గళం విప్పుతున్నారు. యువతకు సుస్థిరమైన రేపటికి అవకాశం కల్పిoచేవి ఐటీ పార్కులు కాదు, అరణ్యాలే. జీవవైవిధ్యాన్ని పణంగా పెట్టి చేసేది అభివృద్ధి కాదు వినాశనం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో కంచ ఫారెస్ట్‌ను కాపాడండి’’అని బాలీవుడ్‌ నటి దియా మీర్జా పేర్కొన్నారు. వీరితోపాటు నటి ఈషా రెబ్బా, బిందు మాధవి కూడా విద్యార్థులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేరుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 

టీవీ, సోషల్‌ మీడియా ప్రముఖులు సైతం.. 
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, నటి రష్మీ గౌతమ్‌ తదితరులతోపాటు పలువురు టీవీ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. చాలా మంది నెటిజన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌ పోస్టుల్లో ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ హెచ్‌సీయూ, సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’వంటి నినాదాలను షేర్‌ చేస్తున్నారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)