Breaking News

జూనియర్‌ కాలేజీల డిజిటల్‌ అడుగులు

Published on Thu, 09/25/2025 - 04:36

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సాంకేతిక సంస్కరణలకు ఇంటర్మీడియట్‌ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమయపాలన కోసం ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు... విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరుతోపాటు సెలవులు, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల జారీ, సర్వీసు పరమైన అంశాలకు సాంకేతికతను జోడించింది. 

ఇందుకోసం బోర్డు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై తరగతులకు విద్యార్థులు హాజరు కాకపోతే వెంటనే వారి తల్లిదండ్రుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు సందేశాన్ని తెలుగులో పంపించనుంది. బోధన, బోధనేతర సిబ్బందికి సెలవుల మంజూరును సైతం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానే జారీ చేయనుంది. 

సిబ్బంది సర్వీసుకు సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ, సర్వీసు పుస్తకాల నిర్వహణ, ఇతర అంశాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దసరా సెలవులు ముగిసిన తర్వాత ఈ వెబ్‌పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 

ప్రత్యేక తరగతులు 
రాష్ట్రంలో 431 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. దాదాపు అన్ని కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. వీటి ద్వారా కాలేజీల్లో తరగతుల నిర్వహణను బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారు. ఇందుకోసం బోర్డు కార్యాలయంలోని ఒకటో అంతస్తులో కంట్రోల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కాలేజీ స్థాయిలో పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు ప్రిన్సిపాల్‌కు అప్పగించారు. 

ప్రస్తుతం బోధన కార్యక్రమాలకు అదనంగా వారంలో మూడు రోజుల పాటు మూడు రకాల కార్యక్రమాలను ప్రవేశపెడతామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. వారంలో ఏదైనా ఒకరోజు యోగా/మెడిటేషన్, మరో రెండ్రోజులు క్రీడలు, ల్యాబ్‌ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 

త్వరలోనే ప్రఖ్యాత సంస్థతో అవగాహన కుదుర్చుకుని ఉచితంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. జూనియర్‌ కాలేజీ విద్యార్థుల డ్రెస్‌ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం అమలు అంశాన్ని కూడా వివరిస్తానని తెలిపారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)