Breaking News

రూటు మారినా.. జర్నీ అదే!

Published on Sat, 06/29/2024 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా,  ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్‌ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్‌ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్‌ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్‌ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్‌ లభించింది.  

ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు  
దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు.  
ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్‌ ఓపెన్‌ చేసినా..ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు.  
 

ఇలా కాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే రిమార్క్స్‌ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్‌ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు.  
నాలుగుసార్లు ఆన్‌లైన్‌లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్‌లైన్‌లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. 
 ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.  

మూడు వారికి... రెండు వీరికి.. 
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్‌ ల్యాండ్‌మ్యాటర్స్‌ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్‌ లేకుండా నాలా, సంస్థాగత పాస్‌బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.

ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు  ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.  

నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు  
ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్‌ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని సీఎంఆర్‌ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు