Breaking News

పత్తి కొను‘గోలగోల’

Published on Wed, 11/05/2025 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా) రకరకాల నిబంధనల నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసి గత నెల 21 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్న ట్టు సీసీఐ ప్రకటించినా, ఇప్పటి వరకు కేవలం 10,434 మెట్రిక్‌ టన్నుల పత్తిని మాత్రమే సేకరించింది. 

ఈ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46 లక్షల ఎకరాల్లో సుమారు 25 లక్షల మంది రైతులు పత్తి సాగు చేయగా, 29 లక్షల మెట్రిక్‌ టన్ను ల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. సీసీఐ తీసుకొచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో ఇప్పటి వరకు 22,587 మంది రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.  

తెరుచుకున్న జిన్నింగ్‌ మిల్లులు 172 మాత్రమే 
320 జిన్నింగ్‌ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు నోటిఫై చేసింది. అయితే జిన్నింగ్‌ మిల్లుల సామర్థ్యం, పత్తి నుంచి దూదిని, గింజలను వేరు చేసి ఇచ్చినందుకు సీసీఐ చెల్లించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిల్లులను ఎల్‌–1, ఎల్‌–2 తరహాలో ఎల్‌–12 వరకు విభజించారు. ఇందులో ఎల్‌–1 కేటగిరీలో గుర్తించిన మిల్లుల్లో తొలుత పత్తి సేకరించిన తర్వాతే ఎల్‌–2, ఆ తర్వాత ఎల్‌–3 మిల్లులకు పత్తిని పంపించేలా సీసీఐ నిబంధనలు విధించింది. 

ముడి పత్తిని మిల్లుకు తీసుకొచ్చిన తర్వాత జిన్నింగ్‌ చేసి బేల్స్‌గా, విత్తనాలుగా వేరు చేస్తారు. ఒక బేల్‌ పత్తి (దూది) కోసం సుమారు 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్‌ చేయాల్సి ఉంటుంది. 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్‌ చేసినందుకు మిల్లులకు సీసీఐ రూ.1,440 చెల్లిస్తుంది. కాగా ప్రస్తుతం 172 మిల్లులు మాత్రమే తెరుచుకోగా, కేవలం ఎల్‌–1 కింద 117 మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు సాగే పరిస్థితి ఏర్పడింది. 

రైతులు గతంలో తమకు దగ్గరలో ఉన్న జిన్నింగ్‌ మిల్లుకు వెళ్లి పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉండగా, ఈసారి ఆ పరిస్థితి లేదు. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో సీసీఐ ఆయా జిల్లాల్లోని ఎల్‌–1 కేటగిరీలో ఉన్న మిల్లుల జాబితాను మాత్రమే పొందుపరచడంతో రైతులు దూరమైనా, అక్కడికే పత్తిని తరలించాల్సి వస్తోంది. ఒకటి, రెండు ఎకరాల చిన్న చిన్న కమతాలు ఉండే రైతులు రవాణా ఖర్చులు భరించి దూరానికి వెళ్లి పత్తి విక్రయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

ఆంక్షలపై మిల్లర్ల అల్టిమేటం 
కపాస్‌ కిసాన్‌ యాప్‌లో రైతుల రిజి్రస్టేషన్‌ తప్పనిసరి చేసిన సీసీఐ... 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే పత్తికి మద్దతు ధర రూ. 8,110 ఇచ్చేలా నిబంధనలు విధించింది. ఒక రైతు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే మద్దతు ధరకు అమ్మేలా నిబంధనలు మార్చారు. 

ఎల్‌–1, ఎల్‌–2 ఇలా మిల్లులకు పత్తి పంపేలా నిబంధనలు మార్చడాన్ని మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో నిబంధనలను సడలించి, మొత్తం మిల్లుల్లో పత్తి జిన్నింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోకపోతే ఈనెల 6వ తేదీ నుంచి పత్తి సేకరణ నిలిపివేస్తామని జిన్నింగ్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. 

Videos

బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

Photos

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు