Breaking News

ప్లస్‌ టు పరీక్షల్లో కాలిక్యులేటర్‌కు అనుమతి

Published on Tue, 03/25/2025 - 00:45

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించే 12వ క్లాస్‌ పరీక్షలకు ఇకనుంచి ప్రాథమిక స్థాయి (బేసిక్‌) కాలిక్యులేటర్‌ను అనుమతించనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. సాధారణ కూడికలు, తీసివేతలు, భాగాహారాలకు సంబంధించిన ప్రోగ్రామ్‌ ఉండే కాలిక్యులేటర్‌ను మాత్రమే విద్యార్థులు పరీక్షకు తీసుకెళ్ళవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన కాలిక్యులేటర్‌ను అనుమతించరు. సీబీఎస్‌ఈ 140వ బోర్డ్‌ మీటింగ్‌ సోమవారం జరిగింది. ఇందులో కాలిక్యులేటర్‌కు అనుమతితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి ఆలోచన శక్తిని సరికొత్త కోణంలో అంచనా వేయడం, సిలబస్‌ విధానం, మూల్యాంకనంలో మార్పులు తదితర సంస్కరణలు తీసుకొచ్చారు.  

ఇకనుంచి ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ విధానం 
ఇకనుంచి ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎంఎస్‌) విధానంతో డిజిటల్‌ మూల్యాంకనం పద్ధతిని అనుసరించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసి, సాఫ్ట్‌వేర్‌ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ఫలితాలు త్వరగా వెల్లడయ్యే వీలుంది. అంతే కాకుండా మూల్యాంకనంలో తప్పులను సాఫ్ట్‌వేర్‌ గుర్తించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ముందుగా 10, 12 తరగతుల సైన్స్, మేథ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు.  

సబ్జెక్టుల్లో నైపుణ్యం మేళవింపు 
చదువుతున్నప్పుడే నైపుణ్యం సంపాదించాలనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యాన్ని సబ్జెక్టుల్లో మేళవించే ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. టెన్త్‌ స్టాండర్డ్‌ నుంచే దీన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పాఠం పూర్తయిన రోజే సైన్స్, సోషల్‌ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. లోతైన ప్రశ్నలతో కూడిన రీజనింగ్‌ అంశాలను విద్యార్థులకు అందిస్తారు. ఈ మేరకు బోధన ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026–27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)