Breaking News

పన్ను ఎగవేతపై పక్కాగా విశ్లేషణ

Published on Wed, 05/28/2025 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: కంపెనీల జమాఖర్చులు, లెక్కలు ఒకప్పుడు పుస్తకాల్లో ఉండేవి. ఆదా యపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు అనుమా నం వస్తే వాటిని స్వాధీనం చేసుకుని సరిచూసే వాళ్లు. ప్రస్తుతం అన్నీ కంప్యూటర్లు, ల్యాప్‌టా ప్‌లు, పెన్‌డ్రైవ్స్, హార్డ్‌డిస్క్‌ల్లోకి మారిపోయా యి. పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో కీలకమైన వీటిని పరిరక్షించడం, విశ్లేషించడానికి డిజిటల్‌ ల్యాబ్స్‌ అవసరం. 

కానీ, కొన్నాళ్ల క్రితం వరకు ఈ ల్యాబ్స్‌ ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఉండేవి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ (సీబీడీటీ) హైదరాబాద్‌లోనూ ఇటీవల డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎనలటిక్స్‌ ల్యాబ్‌ (డీఐఏఎల్‌)ను ఏర్పాటు చేసింది. బషీర్‌బాగ్‌లోని అయకార్‌ భవన్‌లో ఇది పని చేస్తోంది. సీబీడీటీ అమలులోకి తెచ్చిన నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ పాలసీ–2024 అమలులో భాగంగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. 

పన్నుల విశ్లేషణలో కీలకం: కంపెనీలు, వ్యక్తులకు చెందిన ఈ–మెయిల్స్, ఆన్‌లైన్‌లో ఉన్న ఆర్థిక లావా దేవీల రికార్డులు, ఇతర డిజిటల్‌ కార్యకలాపాలను విశ్లేషించి, దర్యాప్తు చేయడానికి ఈ డయల్‌ ఉపకరి స్తోంది. ఆదాయపు పన్ను ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని ఐటీ అధికా రులు దర్యాప్తు చేస్తుంటారు. ఇందులో భాగంగా సంస్థలు, వ్యక్తుల స్థిరచరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాల వివరాలతో పాటు కార్పొరేట్‌ వ్యవహా రాల మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, జీఎస్టీ, బ్యాంకు ఖాతాలు తదితర లావా దేవీలు, రికార్డులను సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది. 

కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తుల సోషల్‌ మీడియా పోస్టులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా విదేశీ పర్యటనలు, భారీ ఖర్చులతో ఆడంబరంగా జరిగిన వివాహాలు, విలాసవంతమైన ఇళ్లు, జీవ శైలిలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ బేరీజు వేస్తూ ఆయా వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ తదితరాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలి. డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉండే ఈ రికార్డులను డయల్‌లో పొందుపరిస్తే చాలు.. పక్కా విశ్లేషణలను అధికారులకు అందిస్తుంది.

దశలవారీగా విశ్లేషించి నివేదికలు ఇవ్వడంతో పాటు ఆయా డేటాను అత్యంత భద్రంగా దాచే సాంకేతికత డయల్‌లో ఉందని అధికారులు చెప్తు న్నారు. దర్యాప్తు అధికారులు సైతం తమ కంప్యూటర్ల ద్వారానే ఈ డేటా మొత్తాన్ని చూసుకునే అవకాశం ఉంది. దాడుల సమయంలో అధికా రులు స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ డేటాను ఈ ల్యాబ్‌ భద్రపరుస్తుంది. 

ఈ డేటాను ట్యాంపర్‌ చేయడానికి, అనధికారికంగా యాక్సెస్‌ చేయడా నికి ఆస్కారం ఉండదు. హైదరాబాద్‌ ల్యాబ్‌కు అనుబంధంగా విజయ వాడ, విశాఖపట్నంలో అక్కడి అవసరాలకు తగ్గట్టు తక్కువ సామర్థ్యంతో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడా నికి సీబీడీటీ సన్నాహాలు చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)