మద్యం కొనేందుకు వెళితే కారుతో పరారయ్యాడు

Published on Tue, 03/18/2025 - 08:51

హైదరాబాద్: మద్యం కొనుగోలు చేసేందుకు షాపులోకి వెళ్తున్న క్రమంలోనే.. గుర్తు తెలియని వ్యక్తి ఖరీదైన కారును కొట్టేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట లీలానగర్‌కు చెందిన తోట ప్రసాద్‌ వ్యాపారవేత్త. ఆదివారం సికింద్రాబాద్‌లో పనులు ముగించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బేగంపేట గ్రీన్‌పార్క్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న రిలాక్స్‌ సంధ్య వైన్‌షాపులో  మద్యం కొనేందుకు తన ఎంజీ హెక్టార్‌ కారులో వెళ్లారు.

 కారును ఆఫ్‌ చెయ్యకుండా అలానే ఉంచి మద్యం షాపులోకి పోతుండగానే తన కారు ముందుకు వెళ్లడం ఆయన గుర్తించారు. వెంటనే అడ్డుకునేందుకు ప్రయతించే లోపే..  ఆగంతకుడు అమీర్‌పేట వైపు వాహనాన్ని తీసుకుని అతివేగంతో వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన ప్రసాద్‌ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైన్‌ షాపు ముందున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. నిందితుడిని  పట్టుకున్నట్లు కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో ఏదైనా దొంగతనాలు చేశాడా? పాత నేరస్తుడా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)