Breaking News

HYD: అనాథాశ్రమంలో బాలికలతో కేర్‌ టేకర్‌ అనుచిత ప్రవర్తన!

Published on Sat, 09/21/2024 - 10:56

సాక్షి, రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్‌ టేకర్‌ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.

వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్‌ టేకర్‌గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు.  వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.

అయితే, కొత్తగా చేరిన కేర్‌ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)