Breaking News

వాష్‌ రూంకు వెళ్లొస్తానని... పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోయిన అభ్యర్థి..

Published on Wed, 08/09/2023 - 08:12

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: పరీక్షా కేంద్రం నుంచి నిర్ణీత సమయం కంటే ముందే పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి మంగళవారం పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్‌ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ సెట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్‌ అసర్‌ హాజరయ్యాడు. బయో సబ్జెక్ట్‌కు విరామం ఇచ్చిన సమయంలో సాయంత్రం 4:15 నిమిషాలకు అసర్‌ టాయిలెట్‌ కోసం అనుమతి తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను పారిపోయినట్లు గుర్తించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)