Breaking News

కలుషిత నీటితో కేన్సర్‌ ముప్పు

Published on Sun, 04/06/2025 - 05:46

సాక్షి, హైదరాబాద్‌: తాగునీటి జలాశయాల్లో కలుస్తున్న మురుగునీటి తో ప్రజల్లో కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా నివేదికలో హెచ్చ రించింది. మురికి కాలు వలు, కలుషిత చెరువుల సమీపంలో నివసించే వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని వెల్లడించింది. 

పారిశ్రామిక, మున్సిపల్‌ వ్యర్థాలతో కూడిన మురుగునీటిలో ఆర్సెనిక్, లెడ్, అల్యూమి నియం వంటి ప్రమాదకర భార లోహాలు అధిక స్థాయిల్లో ఉంటున్నాయని పేర్కొంది. మురుగునీటిలోని భార లోహాలు తాగునీటిని, వ్యవసాయానికి ఉపయోగించే నీటిని కూడా కలుషితం చేస్తున్నాయని.. ఈ నీటితో పండించిన పంటలు కూడా కేన్సర్‌ కారకాలుగా మారుతున్నాయని వివరించింది.

నివేదికలోని అంశాలు ఇలా..
ఐసీఎంఆర్‌ తాజా నివేదిక ప్రకారం చర్మ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఆర్సెనిక్‌ కారణం అవుతుండగా నాడీ వ్యవస్థను లెడ్‌ దెబ్బతీస్తూ కిడ్నీ సమస్యలను తెస్తోంది. అలాగే మూత్రపిండాలు, ఎముకలపై కాడ్మియం ప్రభావం చూపుతోంది. క్రోమియం కూడా కేన్సర్‌కు కారణమవుతోంది. అల్యూమినియం వంటి అధిక సాంద్రతగల లోహాలు కూడా శరీరంలో చేరి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భారలోహాలు శరీర కణాలు, డీఎన్‌ఏను దెబ్బతీస్తున్నాయని.. దీనివల్ల కేన్సర్‌తోపాటు మూత్రపిండాల వైఫల్యం, నాడీ సమస్యలు, రక్తహీనత వంటి రోగాలు వస్తున్నాయని అంటున్నారు.

రాష్ట్ర జలాశయాలు కాలుష్యమయం
రాష్ట్రంలో పట్టణ వ్యర్థాలు, మురుగునీరంతా సమీపంలోని జలాశయాల్లోకే విడుదలవుతోంది. ఇప్పటికే మూసీ నది, హుస్సేన్‌ సాగర్‌ వంటి జలాశయాలు తీవ్ర కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుండగా కృష్ణా, గోదావరి నదులకు కూడా ఈ బెడద తప్పడం లేదు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని లక్సెట్టిపేట, మంచిర్యాల, గోదావరిఖని, భద్రాచలం తదితర పట్టణాల నుంచి వచ్చే మురు గునీరంతా నేరుగా నదిలో కలుస్తోంది. అలాగే కరీంనగర్‌లోని మురుగునీరు ఎగువ భాగంలో గోదావరి ఉపనది మానేరులో కలుస్తుండగా దిగువన మానేరు కాలువల గుండా మళ్లీ గోదావరిలో కలుస్తోంది. మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంత పట్టణాల్లోని మురుగునీరు కూడా నదిలోకి చేరుతోంది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)