Breaking News

‘లక్ష’ణంగా ఖజానా!

Published on Sat, 10/04/2025 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లకు చేరవయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలలకుగాను రాష్ట్ర ఖజానాకు రూ. 96,654.25 కోట్లు సమకూరినట్లు కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కాగ్‌ ఇచి్చన నివేదిక మేరకు రెవెన్యూ రాబడులు రూ. 63 వేల కోట్లు దాటగా అప్పులు రూ. 33 వేల కోట్ల మార్కు చేరాయి. పన్నుల ఆదాయం రూ. 60 వేల కోట్లకు చేరువ కాగా గతేడాదితో పోలిస్తే ఒక శాతం మేర పన్ను రాబడులు తగ్గాయి.  

భారీగా అప్పుల పద్దు 
కాగ్‌ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 54 వేల కోట్లకు పైగా అప్పులు సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపర్చగా అందులో 61.87 శాతం అంటే రూ. 33,434 కోట్లు ఈ ఐదు నెలల్లో సమకూరాయి. అయితే ఈ లెక్క ఆగస్టు వరకు మాత్రమే. గత నెలలో ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంది. ఈ అప్పులతో కలిపితే రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే అప్పులు దాదాపు 90 శాతానికి చేరనున్నాయి. గతేడాదితో పో లిస్తే అప్పులు   ఈసారి కూడా ఎక్కువేనని ‘కాగ్‌’లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి ఆ ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే 59.79 శాతం అప్పులు తీసుకోగా ఈసారి అది మరో రెండు శాతం పెరిగింది.  

పన్ను ఆదాయం ఇలా... 
ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల రాబడులను పరిశీలిస్తే గతేడాది కంటే కొంచెం తగ్గినా అటూఇటుగానే పన్ను ఆదాయం వస్తోందని ‘కాగ్‌’వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి జీఎస్టీ కింద రూ. 21,144 కోట్లు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,218 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 14,079 కోట్లు, ఎక్సైజ్‌ రూపంలో రూ. 7,758 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 7,413 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీల ద్వారా రూ. 3,352.82 కోట్లు వచ్చాయి. వాటికి అదనంగా పన్నేతర ఆదాయం కింద రూ. 1,578 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ. 1,673 కోట్లు సమకూరాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)