Breaking News

రాష్ట్రంలోనే కడుపు ‘కోత’లెక్కువ

Published on Wed, 04/26/2023 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అమ్మకు కడుపు ‘కోత’తప్పడంలేదు! దేశంలోకెల్లా తెలంగాణలోనే సిజేరియన్‌ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (హెచ్‌ఎంఐఎస్‌) తాజా నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం 2021–22లో సిజేరియన్ల జాతీయ సగటు 23.29 శాతంగా ఉండగా రాష్ట్రంలో అది ఏకంగా 54.09 శాతంగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం.

అయితే తెలంగాణకన్నా ఎంతో వెనుకబడిన బిహార్‌లో మాత్రం అత్యంత తక్కువగా 5.66 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఆ తర్వాత జార్ఖండ్‌లో 9.13 శాతం, యూపీలో 9.51 శాతం, మధ్యప్రదేశ్‌లో 12.97 శాతం సిజేరియన్లు మాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ తరహాలో జమ్మూకశీ్మర్‌లో 48.97 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోకెల్లా పదో స్థానంలో నిలిచింది.  

నివేదికలోని ముఖ్యాంశాలు.. 
♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10 శాతం నుంచి 15 శాతానికి మించకూడదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో అంతకు ఐదు రెట్లు ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి. 

♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల జాతీయ సగటు 15.48 శాతం ఉండగా ప్రైవేటులో అది 37.95 శాతం ఉంది. 

♦ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 47.13 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి. 

♦ బిహార్‌లో అత్యంత తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.86 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. 

♦ 2021–22లో పుట్టిన శిశువుల్లో వివిధ కారణాల వల్ల తెలంగాణలో 2,171 మంది చనిపోయారు.  

♦బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ సరఫరాలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా ఆ ఏడాది 4.21 కోట్లు సరఫరా చేయగా, అత్యధికంగా తమిళనాడులో కోటిన్నర, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1.16 కోట్లు సరఫరా చేశారు. తెలంగాణలో కేవలం 1,552 మాత్రమే సరఫరా చేశారు.  

♦ 2021–22లో తెలంగాణలో 6.06 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో రెండున్నర కేజీల బరువుతో పుట్టినవారు 37,792 మంది ఉన్నారు. 4.89 లక్షల మంది గంటలోపు తల్లిపాలు తాగారు.  

♦ 2021–22లోతెలంగాణలో 46.70 లక్షల కండోమ్‌లు పంపిణీ అయ్యాయి.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)