Breaking News

ఆ రెండు శాఖల్లోనే ఆదాయం పెరిగిందా!

Published on Tue, 09/09/2025 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: ‘వాణిజ్య పన్నుల్లో 4.7 శాతం, గనుల శాఖలో 18.6 శాతం మేరకు ఆదాయం పెరుగుదల కనిపిస్తోంది. మరి ఇతర ఆదాయార్జన శాఖల మాటేమిటి? ఎందుకు ఆయా శాఖలు ఆదాయ సమీకరణలో వెనుకబడ్డాయి?’అని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ప్రశ్నించింది. మిగిలిన శాఖల్లో కూడా ఆదాయం పెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది.

సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద ఓ ప్రాజెక్టులో పూడికతీతను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను గిరిజన ఏజెన్సీల ద్వారానే నిర్వహించాలని, వారికి యంత్ర సామగ్రి అందుబాటులో ఉండదు కనుక, ఐటీడీఏల్లోని ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా సమకూర్చాలని సూచించారు. ఔటర్‌ రింగురోడ్డు లోపలి భాగంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, వికాస్‌రాజ్, లోకేశ్‌ కుమార్, శ్రీధర్, శశాంక, రాజీవ్‌గాంధీ హనుమంతు, సురేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)