Breaking News

Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య

Published on Sat, 11/01/2025 - 08:18

సిద్దిపేటఅర్బన్‌: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్‌ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్‌లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. 

దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్‌ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్‌ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. 

అయితే ఇది గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.   

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు