Breaking News

మంటల్లో ట్రావెల్స్‌ బస్సు

Published on Wed, 11/12/2025 - 04:30

చిట్యాల: హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఇంజన్‌లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ స్లీపర్‌ కోచ్‌ బస్సు సోమవారం రాత్రి 12 గంటల తరువాత హైదరాబాద్‌ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురం గ్రామానికి 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. 

జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ శివారులోకి రాగానే టీ బ్రేక్‌ కోసం బస్సును కాసేపు ఆపారు. అనంతరం బస్సు రాత్రి 1.30 గంటల సమయంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోకి రాగానే ఇంజన్‌లో పొగ రావటాన్ని డ్రైవర్‌ గమనించాడు. దీంతో బస్సును రహదారి పక్కన నిలిపివేసి, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. 

ప్రయాణికులు బస్సు ప్రధాన ద్వారంతో పాటు వెనక ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ గుండా బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డీజిల్‌ ట్యాంకులో నిండుగా డీజిల్‌ ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున లేచి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాద స్థలానికి రామన్నపేట, చౌటుప్పల్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆరి్పవేశారు. పోలీసులు వచ్చి ప్రయాణికులను ఇతర వాహనాలలో గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. 

పొగతో మంటలు లేచాయి: ఆదిలక్ష్మమ్మ, అత్తిలి  
హైదరాబాద్‌ నుంచి విహారి ట్రావెల్స్‌ బస్సులో అత్తిలికి ప్రయాణిస్తున్నాము. వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సు ఇంజన్‌ నుంచి పొగ వాసన రావడం మొదలైంది. వెంటనే డ్రైవర్‌ మమ్మల్ని అప్రమత్తం చేసి కిందకి దింపాడు. అనంతరం బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)