Breaking News

నీటిలో మునిగి బీటెక్‌ విద్యార్థి గల్లంతు

Published on Mon, 07/28/2025 - 09:01

రాజేంద్రనగర్‌: వాటర్‌ ఫాల్స్‌ చూసేందుకు వచ్చిన బీటెక్‌  విద్యార్థి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నీటిలో మునిగి గల్లంతైన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన అక్షిత్‌రెడ్డి(24) బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులైన రోహిత్, పవన్, అనీల్‌లతో కలిసి బైక్‌లపై ఉప్పర్‌పల్లి మొండితత్వ ప్రాంతానికి చెరుకున్నారు. అంతకుముందు వారు గూగుల్‌లో నగరానికి సమీపంలోని వాటర్‌ ఫాల్స్‌ కోసం సెర్చ్‌ చేయగా ఈ ప్రాంతాన్ని చూపించింది. అన్నింటికంటే దగ్గరగా ఉండటంతో నలుగురూ ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. ఫొటోలు దిగుతూ రీల్స్‌ చేస్తూ సందడి చేశారు. అనంతరం అక్షిత్‌ రెడ్డి వాటర్‌ ఫాల్స్‌ మీదుగా ముందుకు నడుస్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు.  మిత్రులు అతడిని కాపాడేందుకు ప్రయతి్నంచినా అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో వారు 100కు డయల్‌ చేసి సమాచారం అందించడంతో రాజేంద్రనగర్‌ పోలీసులు డీఆర్‌ఎఫ్‌ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న డీఆర్‌ఎఫ్‌ బృందం సాయంత్రం వరకు గాలించినా అతని జాడ తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ఇదే జలపాతంలో నలుగురు నీట మునిగి మృతి చెందడంతో కంచె ఏర్పాటు చేశారు. అయినా కంచెను తొలగించి నీటిలో ఈదడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే అక్షిత్‌ రెడ్డి మృతి చెందాడు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)