Breaking News

రౌడీషీటర్‌ దారుణ హత్య

Published on Wed, 07/22/2026 - 04:11

మీర్‌పేట: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతీకార హత్య కలకలం రేపింది. తన అక్క, అన్నను చంపాడని పగ పెంచుకున్న నిందితుడు అదను కోసం చూసి, పథకం ప్రకారం రౌడీషీటర్‌ను హతమార్చాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరి (41) వృత్తిరీత్యా కారు డ్రైవర్‌. తండ్రి చనిపోవడంతో తల్లి యాదమ్మ, రెండో భార్య పూజ, కుమార్తెతో కలిసి కొంతకాలంగా ఉప్పల్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్నా­డు. అంతకుముందు సూరి ఫాతిమాను ప్రేమ వివా­హం చేసుకున్నాడు. 

భార్యపై అనుమానంతో 2022­లో ఆమెను హత్య చేశాడు. దీనిపై ఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్‌ పలుమార్లు సూరిని బెదిరించడంతో 2024లో అతన్ని కూడా హతమార్చాడు. అనంత­రం జైలునుంచి తిరిగివచ్చి నాలుగేళ్ల క్రితం పూజ అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నా­డు. నందనవనం గణే­శ్‌­నగర్‌లో నివాసముండే రెండో భార్య పూజ సోదరుడు గోవింద్‌ జన్మదిన వేడుకకు సో­మవారం రాత్రి సూరి ఉప్పల్‌ నుంచి భార్య­తో కలిసి వచ్చాడు. అదేప్రాంతంలో ఉండే మొదటి భార్య ఫాతి­మా తమ్ముడు అర్ఫాజ్‌ (24) కొంతకాలంగా సూరిపై రగిలిపోతున్నాడు. 

తన అక్క, అన్నను చంపిన వాడిని ఎలా­గైనా తుదముట్టించాలని నిర్ణ­యించుకున్నాడు. ఈ క్రమంలో సూరి వచి్చన విషయం తె­లుసుకుని పథకం ప్రకారం ఇద్ద­రు అనుచరులతో కలిసి బర్త్‌­డే వేడుకకు హాజరయ్యా­డు. అందరితో కలివిడిగా మా­ట్లాడి, సరదాగా ఉన్నట్లు నటించి అందరికీ కేక్‌ తినిపించి సందడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత వెంట తెచ్చుకున్న పెప్పర్‌ స్ప్రేను సూరిపైకి వదిలాడు. దీంతో అప్రమత్తమైన సూరి పారిపోతుండగా, కొంతదూరం వెంబడించి టీకేఆర్‌ కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి పట్టుకుని ఛాతి, పొట్ట, తొడ భాగాల్లో కత్తితో అర్ఫాజ్‌ దాడి చేసి పారిపోయాడు. 

రక్తపు మడుగులో ఉన్న సూరిని పూజ పెద్దనాన్న కుమారుడు వినోద్‌ గమనించి మరో ఇద్దరితో కలిసి చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సూరిపై తెలంగాణలోని 18 పోలీస్‌ స్టేషన్లలో 40 కిపైగా క్రిమినల్‌ కేసులతో పాటు రౌడీషీట్‌ కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన అనంతరం నిందితుడు అర్ఫాజ్‌ తన అనుచరులతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఇన్‌స్టా లైవ్‌ చాట్‌ ద్వారా తెలుస్తోంది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)