Breaking News

దాడికి కారణమేంటి?

Published on Tue, 10/31/2023 - 03:41

మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్‌ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్ప­దమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడే­వా­డని స్థానికులు చెప్తున్నారు.

కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నా­యని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నా­రు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమి­టన్నది అంతుప­ట్టడం లేదని అంటు­న్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.

అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)