Breaking News

తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు.. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌

Published on Fri, 10/11/2024 - 15:29

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్‌ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా గ్రామాలను చేర్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే పలు ఫామ్‌హౌస్‌లకు గ్రామ పంచాయితీలు అనుమతులు ఇచ్చాయి. జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతినిచ్చింది. హైడ్రా తెర మీదకు రావడంతో గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.

కాగా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్‌ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్‌ మ­హా­­నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌­నగర్‌ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది.

దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయో­గపడుతుందని కొ­ను­గోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామా­న్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్‌ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవ­సర సమయంలో ఉపయో­గప­డుతుందను­కుంటా­రు.

రిజిస్ట్రేషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్

ఇదీ చదవండి: ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్‌

నగదు అవసరమైనప్పుడు ప్లాట్‌ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్‌ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగక­పోతే కొనుగో­లు­దారు­లెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్‌ ఎందుకూ పనికిరాకుండా మిగిలి­పోయినట్టయింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)