Breaking News

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్

Published on Sat, 11/29/2025 - 21:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణికి బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీని అధికారులు నిలిపేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు 44 లక్షల చీరలను పంపిణి చేసిన ప్రభుత్వం.. మొత్తం కోటి చీరలను పంపిణీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

కాగా, తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇవాళ(నవంబర్‌ 29 శనివారం)తో ముగిసింది. ఆదివారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్రూ్కటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు.

సర్పంచ్‌/వార్డు మెంబర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైన పక్షంలో సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్‌/ సబ్‌ కలెక్టర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మరుసటి రోజు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జతచేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది.

నామినేషన్ల తిరస్కరణ అవకాశాలు తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న సర్పంచ్‌ /వార్డుల అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు.

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)