Breaking News

ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి బ్రేక్‌

Published on Mon, 05/05/2025 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమాచార కమిషన్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల భర్తీ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు సమాచార కమిషనర్ల నియామక ప్రతిపాదనలను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం కోసం గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపించింది. కొందరు అభ్యర్థుల అర్హతల విషయంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత ఫైల్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయంలో రాజ్‌భవన్‌ ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్నట్టు తెలిసింది.  

కొన్ని పేర్లపై అభ్యంతరం 
ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల పోస్టుల భర్తీ కోసం 2023 జూలై 4న ఒకసారి, 2024 జూన్‌ 12న మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన కమిటీ ఇటీవల సమావేశమై పలువురిని ఎంపిక చేసి రాజ్‌భవన్‌కు సిఫారసు చేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి, సమాచార కమిషనర్లుగా జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్‌రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, న్యాయవాది పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌తో పాటు రాములు, వైష్ణవి, మొహిసిన పర్వీన్‌ పేర్లను ప్రతిపాదించింది. 

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 12(5) ప్రకారం న్యాయశాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ, మెనేజ్‌మెంట్, జర్నలిజం, పరిపాలన రంగాల్లో విశేష కృషిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. సెక్షన్‌ 12(6) ప్రకారం వారు ఎమ్మెల్యే, ఎంపీ కారాదు. ఎలాంటి లాభదాయక పోస్టులో ఉండరాదు. రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం కలిగి ఉండరాదు. వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉండరాదు. 

కానీ, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో కొందరికి రాజకీయ నేపథ్యం ఉండడంతో పలువురు వ్యక్తులు రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫైల్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. అర్హతల విషయంలో స్పష్టత వచి్చన తర్వాతే గవర్నర్‌ ఆమోదించే అవకాశం ఉంది. అవసరమైతే గవర్నర్‌ కొందరు అభ్యర్థుల పేర్లను మినహాయించి ఇతరుల పేర్లను ఆమోదించే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)