Breaking News

ఊపిరి తీసిన ‘ఉపాధి’

Published on Fri, 01/31/2025 - 09:02

సాక్షి, హైదరాబాద్‌/హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడటంతో తల్లీకూతురు మృత్యువాతపడ్డారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సారవ్వ (50), అన్నాజీ మమత (32) తల్లీకూతుళ్లు. ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు గ్రామ శివారులోని సంజీవరాయిని గుట్ట వద్ద మట్టి తవ్వకాల పనులకు వెళ్లారు. 

మట్టి బలంగా ఉండటంతో తవ్వడానికి సులువుగా ఉంటుందని పనిచేసే ప్రదేశంలో రాత్రి వేళ నీళ్లను పట్టారు. రోజు మాదిరిగానే పనులు చేస్తుండగా ఒక్కసారిగా దాదాపు 10 బండరాళ్లు నేలకూలాయి. అక్కడే పనిచేస్తున్న సారవ్వ, మమతపై బరువైన బండరాళ్లతో పాటు మట్టి పెళ్లలు పడి భూమిలో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

విచారణకు మంత్రుల ఆదేశం.. 
బండరాళ్లు పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ వేర్వేరుగా తీవ్ర ది్రగ్బాంతిని వ్యక్తం చేశారు. తక్షణం సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ మనుచౌదరితో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో పనులు చేయొద్దని వారం రోజుల క్రితమే జిల్లా అధికారులు హెచ్చరించినా.. పనులు కొనసాగడం పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)