Breaking News

వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం

Published on Tue, 07/08/2025 - 12:19

ఖమ్మం: వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించినా భర్త అనుమానంతో విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవితఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీని వాస్‌ సోమవారం తీర్పు వెలువరించారు. బోనకల్‌ కు చెందిన పాలెపు సునీత తన మామ(భర్త తండ్రి) నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత, తండ్రి నర్సింహారావు కలిశారు. ఈ విషయాన్ని అప్పుడు 11ఏళ్ల సునీత పెద్దకుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆపై భర్త హరికృష్ణకు ఫోన్‌ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రు వీకరించారు. 

అయితే, హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీ సులు సునీత, నర్సింహారావును విచారించగా అసలు విషయం బయటపడడంతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్‌ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు ప్రాసిక్యూటర్‌ అబ్దుల్‌బాషా వాదించగా, కేసు విచారణలో కీలకంగా వ్యహరించిన సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బంది బి.అరవింద్, శ్రీకాంత్‌ను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ అభినందించారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)