Breaking News

కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్‌ పగిలింది..

Published on Wed, 04/09/2025 - 17:36

చందుర్తి (వేములవాడ): పూజారి సూచించిన చోట.. మూఢ నమ్మకంతో తవ్విన బోరువెల్‌.. భగీరథ పైపులైన్‌ను పగుల గొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడ పల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మూడ పల్లికి చెందిన ఓ రైతు సాగునీటి కోసం బోరు వేయాలని ఓ పూజారిని ఆశ్రయించాడు. 

ఆ పూజారి కొబ్బరికాయను చేతిలో పెట్టుకొని.. నీటి ఊటల కోసం పొలంలో కలియతిరిగాడు. సరిగ్గా మిషన్‌భగీరథ పైపులైన్‌ వెళ్లిన ప్రదేశంలో నీరు ఉందని.. అక్కడ బోరు వేయాలని సూచించాడు. పూజారి సూచనలతో బోరు వేయించగా.. భూమి లోపలి నుంచి వెళ్తున్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలి నీరంతా వృధాగా పోయింది. పైపులైన్‌ పగిలినట్లు గుర్తించిన బోర్‌వెల్‌ వాహన నిర్వాహకుడు.. తమపై ఎక్కడ పోలీస్‌ కేసు నమోదవుతుందోనన్న భయంతో.. వాహనంతో సహా పరారయ్యాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న అధికారులు పైపులైన్‌కు మరమ్మతులు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)