Breaking News

హైదరాబాద్ : రేపటి నుంచి ఆషాఢ మాసం బోనాలు

Published on Wed, 06/25/2025 - 11:35

ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారం భమవుతున్నాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబ స్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను ఇప్పటికే మం జూరు చేసింది. పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.

Telangana Bonalu celebrations in 2025 will begin on 29th June 14

బంగారు బోనమెత్తనున్న శ్యామల, నిషా క్రాంతి, అవిక

ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల- సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహ కాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ సిద్ధమైంది. కాగా.. ఈసారి బంగారు బోనం ఏడు గుళ్లకు కాకుండా.. కేవలం మూడు దేవాలయాలకు మాత్రమే పరిమి తమవుతోంది. గోల్కొండ జగదాంబ అమ్మవా రితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిషా క్రాం తి బంగారు బోనాన్ని సమర్పించనుంది. ఇక విజ యవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా... మరో జోగిని అవికా పెద్దమ్మ తల్లి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ నిర్వహకుల ద్వారా సమర్పించనున్నారు.

Telangana Bonalu celebrations in 2025 will begin on 29th June 15

బంగారు బోనం షెడ్యూల్ ఇలా..

👉 :  జూన్ 26న గోల్కొండ అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగం గా గోల్కొండ ఆ మ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు.

👉 :  భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున శ్రీ జగదాంబికా అమ్మవా రికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు.

👉 : 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారికి 2వ బంగారు బోనం..

👉 :  జులై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోసం

👉 :  జూలై 4 న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం

👉 :  జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహం కాళి అమ్మవారికి 5వ, బంగారు బోనం..

👉 :  15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు బోనం

👉 :  జూలై 17న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు