Breaking News

26న గోల్కొండ తొలి బోనం

Published on Wed, 06/11/2025 - 11:13

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఆషాఢ మాసం బోనాల వేడుకలు ఈ నెల 26న గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఆషాఢ మాసం బోనాల పండుగకు సంబంధించి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడుతూ జూన్‌ 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

 అనంతరం జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 13న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర, 14న రంగం, 20న అక్కన్న మాదన్న బోనాల జాతర, లాల్‌ దర్వాజా బోనాలు జరుగుతాయన్నారు. జులై 24న బోనాల పండుగ ముగుస్తుందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసం బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వ్రస్తాలు సమరి్పస్తుందని, ఇందులో మంత్రులు పాల్గొంటారని, 19 దేవాలయాల్లో ఈఓలు, దేవాలయ శాఖ అధికారులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమరి్పస్తారన్నారు. అగి్నమాపక శాఖ అధికారులు ముందుగా దేవాలయాలను సందర్శించి ప్రణాళిక రూపొందించుకుని ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలన్నారు. 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు