Breaking News

నగరంలో సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు

Published on Wed, 10/23/2024 - 04:32

జవహర్‌నగర్‌: ఢిల్లీలోని ఓ సీఆర్పీఎఫ్‌ పాఠశాల ప్రహరీ వద్ద మూడు రోజుల కిందట బాంబు పేలుడు సంభవించిన ఘటనను మరువక ముందే హైదరాబాద్‌ శివారులోని జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్‌ పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపు సందేశం మంగళవారం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సీఆర్పీఎఫ్‌ పాఠశాలకు ఈ–మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు సందేశం పంపారు. 

జవహర్‌నగర్‌ సీఆర్పీఎఫ్‌ పాఠశాలతోపాటు ఢిల్లీలోని రోహిణి, ద్వారకాలోగల సీఆర్పీఎఫ్‌ పాఠశాలలో బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాల ప్రారంభమయ్యాక యాజమాన్యం ఈ–మెయిల్‌ను చూసి అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను బస్సుల్లో ఇళ్లకు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ పోలీసులతోపాటు రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ మహేశ్, జవహర్‌నగర్‌ సీఐ సైదయ్య పాఠశాలకు చేరుకొని పరిసర ప్రాంతాలను, పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాగిలాలతో, బాంబు స్క్వాడ్‌తో అనువనవూ గాలించి బాంబు లేదని నిర్ధారించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సతీమణి పేరున కొందరు దుండగులు ఫేక్‌ ఐడీ సృష్టించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)