Breaking News

ఇంటర్‌ చదువు మోతాదు పెంపు

Published on Wed, 12/31/2025 - 02:55

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ స్థాయిని పెంచాలని బోర్డు నిర్ణయించింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యాంశాలను ప్రామాణికంగా తీసుకోనుంది. ఇంటర్మీడియెట్‌ విద్యలో మార్పుల దిశగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

తెలుగు, చరిత్ర పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతితో కూడిన పాఠ్యాంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ విధంగా పుస్తకాల ముద్రణ కోసం త్వరలో తెలుగు అకాడమీకి ప్రతిపాదనలు వెళ్ళనున్నాయి. కాగా పుస్తకాలను మల్టీ కలర్‌ (బహుళ వర్ణాల్లో)లో ముద్రించాలని నిర్ణయించారు. మార్పులు చేర్పులతో కూడిన పుస్తకాలను ఏప్రిల్‌ రెండో వారంలో అందుబాటులోకి తెచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. కొత్త సిలబస్‌పై వేసవి సెలవుల్లో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.  

కొత్తగా ఏసీఈ 
» ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఇంటర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్‌ (ఏసీఈ) కోర్సును అందుబాటులోకి తీసుకొస్తారు. సీఈసీ, ఏసీఈ పుస్తకాలు వేర్వేరుగా ముద్రిస్తారు.  
»   ఎంఈసీ కోర్సులో గణితం సబ్జెక్టుకు 150 మార్కులకు పరీక్షలను నిర్వహించి, 100 శాతం మార్కులనే లెక్కించేవారు. కానీ ఇప్పుడు 100 మార్కులకే ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్‌ ఉంటాయి. 
»   ఈసారి పుస్తకాల ముద్రణకు సమాంతరంగా తర్జుమా కూడా చేస్తున్నారు. ఇదివరకు ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలు ముద్రించిన ఏడాదికి ఉర్దూ మీడియం పుస్తకాలొచ్చేవి. కానీ ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియంతో పాటే ఉర్దూ మీడియం పుస్తకాలను ముద్రిస్తున్నారు. 
»   పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపర్‌ను మార్చారు. ఈసారి 70 జీఎస్‌ఎం, ఎస్‌ఎస్‌ మ్యాప్‌లితో పేపర్‌ను వినియోగిస్తారు. 
» పాఠ్య పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌తో ముద్రిస్తున్నారు. కోడ్‌ను స్కాన్‌ చేయగానే అదనపు అంశాలు ప్రత్యక్షమవుతాయి. 
»  ఆర్ట్‌ కోర్సుల్లో 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్‌ ఉంటాయి. గణితం పరీక్షను ఇక నుంచి 60 మార్కులకే నిర్వహిస్తారు. ఇప్పటివరకు 75 మార్కులకు నిర్వహించగా, 15 మార్కులకు ఇంటర్నల్స్‌ ఉండేవి. 
» సైన్స్‌ కోర్సుల్లో 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉండగా, మొదటి సంవత్సరంలో 15 మార్కులకు ఇంటర్నల్స్‌ ఉంటాయి. సెకండియర్‌లో 15 మార్కులకు ఎక్స్‌టర్నల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలుంటాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)