Breaking News

తెలంగాణలో బ్లాక్‌ చెయిన్‌ సిటీ

Published on Sat, 01/04/2025 - 03:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ(Telangan) లో బ్లాక్‌ చైన్‌ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు(Sridhar Babu) వెల్లడించారు. ఈ సిటీని ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామని చెప్పారు. డ్రోన్‌ టెక్నాలజీ, రొబోటిక్స్‌ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ హెచ్‌సీ రొబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’నూతన క్యాంపస్‌ను మంత్రి శుక్రవారం మాదాపూర్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సాంకేతికత ఆవిష్కరణలో తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిపేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. దేశంలో ఫ్రాంటియర్‌ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందని, దానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. డ్రోన్‌ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచి్చ.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబు
తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబును భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఘనంగా సన్మానించారు. గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ (అండర్‌–19) టోర్నమెంట్‌ పోస్టర్‌ను కూడా మంత్రి విడుదల చేశారు.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)