Breaking News

సీఎం ఉన్నారా?.. పాలన సాగుతోందా? 

Published on Tue, 04/04/2023 - 09:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలు ప్రభుత్వాధినేతగా సీఎం ఉన్నారా? అసలు పాలన సాగుతోందా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. మొత్తం పాలనను పడకేసేలా ఫక్తు రాజకీయాలు చేస్తూ సీఎం.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడం ఏంటని నిలదీశారు.

దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేని స్థితికి చేరుకున్నందున ఐటీశాఖ మంత్రికి కేబినెట్‌లో కొనసాగే నైతికహక్కు ఉందా? అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. కేటీఆర్‌ పొద్దున లేస్తే టెక్నాలజీ గురించి మాట్లాడతారని ఎద్దేవాచేశారు. సీఎంకు ఊర్లు తిరగడానికి సమ యం ఉంటుంది కానీ, పేపర్‌ లీకేజీలు, తదితర విషయాలపై సమీక్షలకు టైమ్‌ ఉండదా? అని నిలదీశారు. కాగా, ఈనెల 8న ప్రధాని రాష్ట్ర పర్యటనను ముఖ్యంగా సికింద్రాబాద్‌ బహిరంగసభను దిగ్విజయం చేయాలని పార్టీ నేతలకు లక్ష్మణ్‌ సూచించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మోదీ కార్యక్రమానికి పార్టీపరంగా చేయాల్సిన సన్నాహాలపై జిల్లాల పార్టీ నేతలతో చర్చించారు. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)