Breaking News

బిర్యానీయే బాస్‌!

Published on Tue, 12/24/2024 - 01:17

సాక్షి, హైదరాబాద్‌: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్‌గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్‌ డిష్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్‌ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్‌లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్‌తో వార్షిక నివేదికను విడుదల చేసింది.

నివేదికలోని విశేషాలు ఇవీ.. 
⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది.  
⇒   బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ సమయాలతో పోలిస్తేడిన్నర్‌ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్‌లు వచ్చాయి. ఇది లంచ్‌ ఆర్డర్‌ల కంటే దాదాపు 29% ఎక్కువ. 
⇒  అత్యధికంగా ఆర్డర్‌ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్‌ ఐస్‌క్రీం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. 
⇒  బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. 

⇒  ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్‌ ప్రజలు అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వంటకం నూడుల్స్‌. 
⇒  స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్‌ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్‌ చేయడంతో సమానం. 
⇒  ముంబైకి చెందిన కపిల్‌ కుమార్‌ పాండే అనే స్విగ్గీ రైడర్‌ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్‌లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్‌లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. 

⇒  బ్రేక్‌ఫాస్ట్‌గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. 
⇒  బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. 

⇒  24.8 లక్షల ఆర్డర్‌లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్‌ చేసిన స్నాక్‌గా చికెన్‌ రోల్‌ నిలిచింది. చికెన్‌ మోమోస్‌ 16.3 లక్షల ఆర్డర్‌లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్‌లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
⇒   చికెన్‌ బర్గర్‌ 18.4 లక్షల మిడ్‌నైట్‌ ఆర్డర్లలో టాప్‌లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్‌ బిర్యానీ దక్కించుకుంది.  
⇒  ఢిల్లీలో ఓ కస్టమర్‌ ఒకే ఆర్డర్‌లో ఏకంగా 250 ఆనియన్‌ పిజ్జాలను ఆర్డర్‌ చేశాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)