Breaking News

బయో ఇంజనీర్డ్‌ ఊపిరితిత్తులు!

Published on Thu, 01/08/2026 - 02:56

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమీప భవిష్యత్తులో బయో ఇంజనీర్డ్‌ ఊపిరితిత్తులు, రక్తనాళాల నమూనాల అభివృద్ధే లక్ష్యంగా కీలక అడుగు పడింది. ఊపిరితిత్తుల ఆరోగ్య సంబంధ పరిశోధనల కోసం దేశంలోనే తొలి బయోఇంజనీరింగ్‌ పరిశోధన కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌) ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో బుధవారం ప్రారంభమైంది. జర్మనీకి చెందిన జస్టస్‌ లీబిగ్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లంగ్‌హెల్త్‌ (ఐఎల్‌హెచ్‌), ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లంగ్‌ హెల్త్‌ ప్రతినిధులు ప్రొఫెసర్‌ వెర్నర్‌ సీగర్, ప్రొఫెసర్‌ సోని సవాయ్‌ పుల్లంశెట్టి సమక్షంలో పద్మవిభూషణ్‌ అవార్డుగ్రహీత, ఏఐజీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న గాలి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని.. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల ఆరోగ్య పరిశోధనలపై దృష్టి సారించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తుల ఆరోగ్య రంగంలో కీలక పరిశోధనలు విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లంగ్‌హెల్త్‌ (ఐఎల్‌హెచ్‌)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం క్లినికల్‌ పరిశోధన, రోగుల ప్రయోజనాలకు కీలక పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశీయ పరిస్థితులకు ప్రపంచస్థాయి పరిష్కారాలే లక్ష్యం.. 
ఇప్పటివరకు ఊపిరితిత్తులు పాడైన రోగులకు అవయవ మార్పిడి చికిత్స విధానమే అందుబాటులో ఉండగా బయో ఇంజనీర్డ్‌ ఊపిరితిత్తులు, రక్తనాళ నమూనాల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగితే ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం రానుందని నిపుణులు చెబుతున్నారు. 

మెకానోబయాలజీ, లేబుల్‌–ఫ్రీ ఇన్‌వివో ఇమేజింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జంతు పరిశోధన సదుపాయాలు ఐఐటీహెచ్‌లో ఉన్నాయి. అలాగే ఐఐటీహెచ్‌లోని మైక్రోఫ్లూయిడిక్స్‌ ల్యాబ్, 3డీ ప్రింటింగ్‌ వంటి సదుపాయాలను కూడా ఈ పరిశోధన కేంద్రం ఉపయోగించుకోనుంది. నాన్‌–ఇన్వేసివ్‌ డయాగ్నొస్టిక్స్, ఆధునిక చికిత్సా విధానాల అభివృద్ధికి ఈ కేంద్రం బాటలు వేయనుంది. వాయు కాలుష్యానికి తోడు, ధూమపానం, ఆహార అలవాట్ల కారణంగా దేశంలో లక్షలాది మంది ఊపిరితిత్తుల కేన్సర్లు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రపంచస్థాయిలో పరిష్కారాలను చూపడమే లక్ష్యంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)