Breaking News

తూనీగలా తిరుగుతూ నిఘా!

Published on Wed, 08/21/2024 - 04:12

సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తూనీగలా             తిరుగుతూ నిఘా పెడు తుంది.. సీతాకోక చిలుకలా కదులుతూ పరిస్థితులను కళ్లకు కడుతుంది... గద్దలా ఎగు రుతూ ఎప్పటికప్పుడు ఫొటో లు, వీడియోలు పంపుతుంది.. ఐఐటీ హైద రాబాద్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న బయో ఇన్‌స్పైర్డ్‌ ఫ్లాపర్‌ డ్రోన్‌ సాంకేతికత ప్రత్యేకత ఇది. పక్షులు, కీటకాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తరహా డ్రోన్లపై ఐఐటీహెచ్‌ పరిశోధనలు చేస్తోంది. 

ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని డిజైన్‌ చేస్తోంది. అటవీ ప్రాంతాలు, కొండలు, చెరువులు, సరస్సులు, దూర ప్రాంతాల్లో సైతం తిరిగేందుకు అనువుగా వాటిని రూపొందిస్తోంది. డ్రోన్లు ఎగిరినట్లు బయో ఇన్‌స్పైర్డ్‌ డ్రోన్లు దేశ సరిహద్దుల్లో సైతం నిఘా పెట్టడానికి ఉపయోగించుకోవచ్చని, భద్రతా అవసరాలకు వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

డ్రోన్లకు కాస్త భిన్నంగా..
 డ్రోన్‌ టెక్నాలజీకి కాస్త భిన్నంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తుంటాయి. అయితే ఒకసారి వాటి చార్జింగ్‌ అయిపోతే తిరిగి చార్జ్‌ చేస్తేనే తిరిగి పనిచేస్తాయి. కానీ తూనీగ మాదిరిగా ఉండే బయో ఇన్‌స్పైర్డ్‌ డ్రోన్‌లో రెక్కలు కొట్టుకోవడం ద్వారా వచ్చే శక్తితో దాటంతట అదే చార్జ్‌ అయ్యేలా డిజైన్‌ చేస్తున్నారు. 

అలాగే గద్ద ఆకారంలో తయారు చేసిన ఫ్లాపర్‌ దూరప్రాంతాలకు సైతం ఎగురుకుంటూ వెళ్లి ఆధునిక కెమెరాల ద్వారా అక్కడి పరిసరాలను వీడియో రికార్డు చేస్తుంది. కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా దీని గమ్యాన్ని మార్చొచ్చు. తక్కువ ఎత్తు నుంచి ఈ డ్రోన్లను ఎగరేయడం వీలవుతుందని.. దీనివల్ల ఇతర దేశాల రాడార్ల నిఘాకు అవి చిక్కవని పరిశోధకులు చెబుతున్నారు.

నాలుగేళ్లుగా పరిశోధనలు..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హెచ్‌లో టీఐహెచ్‌ఏఎన్‌ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌  ఆన్‌ అటానమస్‌ నేవిగేషన్‌) అనే పరిశోధన విభాగం ఉంది.  ఇందులో యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌), ఆర్‌ఓవీ (రిమోట్లీ  ఆపరేటెడ్‌ వెహికల్స్‌) రకాల అటానమస్‌ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు. 

గత నాలుగేళ్లుగా వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏరోస్పేస్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి బ్రాంచీలకు చెందిన ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.

నిఘా, భద్రత అవసరాలకు ఉపయోగపడేలా
బయో ఇన్‌స్పైర్డ్‌ డ్రోన్‌లపై పరిశోధనలు కొనసాగు తున్నాయి. ఇవి ప్రొటోటైప్‌ (నమూన దశ) స్టేజీలో ఉన్నాయి. కొన్ని డ్రోన్‌ల పరిశోధనలు చివరి దశకు చేసుకుంటున్నాయి. పక్షులు, తూనీగ వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని బయో ఇన్‌స్పైర్డ్‌ డ్రోన్లను తయారు చేస్తున్నాం. దేశ నిఘా, భద్రతా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడేలా వాటిని అభివృద్ధి చేస్తున్నాం.
– సంతోష్‌రెడ్డి, టెక్నికల్‌ ఆఫీసర్, టీఐహెచ్‌ఏఎన్‌

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు