Breaking News

ముత్తూట్‌ ఫైనాన్స్‌కు తాళం

Published on Thu, 12/11/2025 - 12:34

పటాన్‌చెరు టౌన్‌: ముత్తూట్‌ ఫైనాన్స్‌కు ఓ బాధితుడు తాళం వేశాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ముత్తంగి గ్రామానికి చెందిన సాయి జీవన్‌ కుమార్‌ ఇటీవల ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టి రూ.9.51 లక్షలు రుణం తీసుకున్నాడు. డబ్బు సమకూరడంతో రుణం తిరిగి చెల్లించాలనుకున్నాడు. ఈ విషయం మేనేజర్‌కు చెప్పాడు. ఆయన సలహా మేరకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ అకౌంట్‌కు రూ.9.51 లక్షలతో పాటు వడ్డీ మొత్తం తన బ్యాంక్‌ ఖాతా నుంచి ఆర్టీజీఎస్‌ చేశాడు. 

కానీ బాధితుడికి బంగారం తిరిగి ఇవ్వలేదు. పలుమార్లు మేనేజర్‌ను కలిసి విన్నవించినా సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. బుధవారం ఫైనాన్స్‌కు వెళ్లాడు. మేనేజర్‌ లేకపోవడంతో సిబ్బందిని నిలదీశాడు. వారి నుంచి కూడా సరైన సమాధానం లేకపోవడంతో ఫైనాన్స్‌ ప్రధాన ద్వారానికి తాళం వేశాడు. దీంతో ఫైనాన్స్‌ సిబ్బంది పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తాళం తీయించి సిబ్బందిని బయటకు పంపించారు. వివరణ కోసం మేనేజర్‌ను ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)