Breaking News

మేం ఉండలేం.. బావమరదలు ఒకేసారి...

Published on Mon, 06/30/2025 - 07:45

సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. కాగా, ఇద్దరు సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో, లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీబీనగర్ ఎస్‌ఐ రమేశ్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాకు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతేపల్లి.. ఇద్దరు వరుసకు బావామరదలు  అవుతారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.

ఇదే కారణంగా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై రెండు రోజుల కిందట బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్‌లో సుష్మిత, సుధాకర్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్‌కి వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ ఎక్కడ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పలేదు. ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీస్‌ స్టేషన్‌కు రంజిత్‌ సమాచారం ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం మొబైల్ నెట్‌వర్క్‌ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు చేరుకొన్నారు. వారు ఉంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూసేసరికి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదిలాఉండగా.. చనిపోయే ముందు సుష్మిత, బాల సుధాకర్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో బాల సుధాకర్‌ మాట్లాడుతూ.. ఆయన భార్య తనను వేధిస్తోందన్నారు. ప్రతీ విషయంలో తనను అనుమానిస్తున్నట్టు తెలిపారు. అలాగే, సుష్మిత మాట్లాడుతూ.. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నాను. బాల సుధాకర్‌తో మాట్లాడినందుకే నాతో అక్రమ సంబంధం అంటగట్టాడు. అందరిలో నన్ను తల దించుకునేలా చేశాడు అని తెలిపారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి ఓ లేఖ కూడా రాసిపెట్టి పలు విషయాలను అందులో వెల్లడించారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)