Breaking News

14 నుంచి భూ భారతి

Published on Sat, 04/12/2025 - 05:07

సాక్షి, హైదరాబాద్‌/ బూర్గంపాడు: నూతనంగా రూపొందించిన భూభారతి చట్టాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. వివిధ మండలాల్లో రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతులకు మేలుచేసేలా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూభారతి చట్టాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చట్టం రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. 14న భూ భారతి పోర్టల్‌ను సీఎం ప్రారంభిస్తారని రెవెన్యూశాఖ వర్గాలు కూడా తెలిపాయి. 

నెలాఖరులోగా ఇల్లు మంజూరు చేస్తా.. 
మణుగూరు టౌన్‌: ‘కమ్మటి భోజనం పెట్టావు అక్కయ్యా.. నీ కష్టం నేను చూడలేకపోతున్నా... ఈ నెలాఖరులోగా నీకు ఇల్లు మంజూరు చేస్తా.. మూడు నెలల్లో ఇల్లు కట్టుకోండి.. మళ్లీ వస్తాను’అంటూ వంకా ముకేందర్‌ కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి భరోసా కల్పించారు. మణుగూరు పర్యటన సందర్భంగా కూనవరంలో సన్నబియ్యం లబ్దిదారుడు ముకేందర్‌ నివాసంలో సన్నబియ్యంతో శుక్రవారం భోజనం చేశారు. ముకేందర్‌ కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా ‘మీకు ఏం సాయం కావాలి’అని పొంగులేటి ప్రశ్నించగా.. ఇల్లు, పిల్లలకు ఉద్యోగాలు లేవని, తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని కుటుంబ పెద్ద శివలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అందుకు మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆమె పెద్దకుమారుడికి రాజీవ్‌ యువ వికాసం ద్వారా కిరాణా షాపు పెట్టించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ను ఆదేశించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)