Breaking News

భూభారతి పోర్టల్‌ ప్రారంభం

Published on Wed, 04/16/2025 - 01:01

సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి పోర్టల్‌ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటే షన్, నాలా మార్పులు, చేర్పులు, అప్పీల్, రివిజన్‌ తదితర సమస్యల పరిష్కా రానికి భూభారతి పోర్టల్‌ వేదిక కానుంది. పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తొలిరోజు మంగళవారం దీనిపై నేలకొండపల్లి తహసీల్‌లో అవగా హన సదస్సు నిర్వహించారు. 

ఈ నెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నేలకొండపల్లి మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డుల సవరణతో పాటు రైతుల భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మండలంలో 37,405 ఎకరాల సాగు భూమి ఉండగా, సాదాబైనామా కింద 3,417 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ధరణిలో రిజి స్ట్రేషన్‌కు సంబంధించి 150 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

వీటిని రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు. పలువురు రైతులు పోర్టల్‌ వివరాలు తెలుసుకునేందుకు తహసీ ల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై నేల కొండ పల్లి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభు త్వం భూభారతి పోర్టల్‌ ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.

స్లాట్‌ బుకింగ్‌ విధానానికి వ్యతిరేకంగా..
నేటినుంచి డాక్యుమెంట్‌ రైటర్స్‌ నిరసనలు  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచ నను విరమించుకోవాలని తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్‌ రైటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానం విఫలమైందన్నారు. దీన్ని గుర్తించి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దస్తావేజులు రాస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, వారంతా రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్, నారపల్లి, మేడ్చల్, సంగారెడ్డి, రాజేంద్రనగర్, చంపాపేట్, ఎల్బీనగర్, చిక్కడపల్లి, మల్కాజిగిరి, చౌటుప్పల్, సూర్యాపేట, జనగామ సబ్‌రిజిస్టార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

సర్వే మ్యాప్‌లు ఇప్పుడే కాదు!
రిజిస్ట్రేషన్లతోపాటు సర్వే మ్యాప్‌ కోసం తర్వాత నోటిఫికేషన్‌
అప్పటివరకు మ్యాప్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికిప్పుడు సర్వే మ్యాప్‌లు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల వుతున్న విధంగానే అవసరమైన డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతా యని వెల్లడించాయి. అయితే, ప్రభుత్వం భూమి మ్యాపింగ్‌ కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇస్తుందని, అప్పుడు లైసెన్సుడ్‌ సర్వేయర్ల చేత సర్వే చేయించి, భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నిర్ధారించి మ్యాప్‌ ఇస్తారని పేర్కొన్నాయి. 

అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో కచ్చితంగా సర్వే మ్యాప్‌ అవసరమవుతుందని, అప్పటివరకు మ్యాప్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపా యి. చట్టం మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతోపాటు మ్యాప్‌ అవసర మవుతుందని పలు సెక్షన్లలో ప్రస్తావించారు.

పోర్టల్‌లో ఏం మారింది?
ధరణి పోర్టల్‌ స్థానంలో వచ్చిన భూభారతిలో ఏముందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సోమ, మంగళవారాల్లో ఈ పోర్టల్‌ను దాదాపు 2.20 లక్షల మంది వీక్షించారు. భూభారతి పోర్టల్‌ వెబ్‌పేజీపై ఎడమ వైపు సీఎం రేవంత్‌రెడ్డి, కుడి వైపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలు, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, తెలంగాణ తల్లి ఫొటో ఉన్నాయి. ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించే ఈ పోర్టల్‌ను ఓపెన్‌ చేయగానే సీఎం రేవంత్‌రెడ్డి సందేశం కనిపిస్తోంది. 

ఆ తర్వాత పొంగులేటి సందేశం, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు (లాగిన్‌), సమాచారం (ప్రజల కోసం), భూధార్, భూమిత్ర, భూపరిపాలన శాఖ, ప్రభుత్వ భూముల రక్షణ, దస్తావేజు రిజిస్ట్రేషన్‌ మార్గదర్శకాల గురించిన వివరాలు పొందుపరిచారు. భూమిత్ర పేరుతో కొత్తగా చాట్‌బాట్‌ ఏర్పాటు చేసినప్పటికీ, అది ఇంకా అందుబాటులోకి రాలేదు.

ధరణిలాగే ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలను ఇచ్చారు. భూముల మార్కెట్‌ విలువ, భూముల వివరాలు, నిషేధిత భూములు, ఈ చలాన్, దరఖాస్తుల పురోగతి, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) నేతృత్వంలో ఈ పోర్టల్‌ను తెలుగుతోపాటు ఇంగ్లిషు భాషలో కూడా రూపొందించారు.  

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)