కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
Published on Sat, 02/05/2022 - 04:53
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు.
తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు.
#
Tags : 1