Breaking News

మధ్యాహ్న భోజనానికీ ఫేస్‌ రికగ్నిషన్‌!

Published on Fri, 02/21/2025 - 05:05

కొత్తగూడెం అర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ఫేస్‌ రికగ్నిషన్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) డేటాను మధ్యాహ్న భోజన పథకా నికి కూడా ఉపయోగించాలని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దప ల్లి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిచేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రెండు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అధ్యయనం చేయాలని గత శనివారం ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు జితేశ్‌ వి.పాటిల్, కోయ శ్రీహర్ష రెండు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పథకంలో మార్పుచేర్పులపై రాష్ట్రస్థాయిలో 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్లు, డీఈఓలతోపాటు కొత్తగూడెం ఎంఈఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నా రు. వీరు మరోమారు అధ్యయనం చేసి సంస్కరణలపై నివేదిక సమర్పించనున్నారు. 

బిల్లుల పెండింగే సమస్య..
మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు సమకూరుస్తున్నాయి. వారానికి మూడుసార్లు కోడిగుడ్ల తో పాటు ఆకు, కూరగాయలతో మెనూ అమలు చేస్తున్నా రు. ఇటీవల మెనూలో మార్పులు చేసినా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 54,200 మంది కార్మికులు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 2,150 మంది పని చేస్తున్నారు. ఈ జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి గతేడాది నవంబర్‌ నుంచి.. 9, 10 తరగతుల వారివి సెప్టెంబర్‌ నుంచి బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. వీరికి నెలకు రూ.3,000 చొప్పున ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందాల్సి ఉంది.

కలెక్టర్ల నివేదికలోని అంశాలు
⇒ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే డేటాను మధ్యాహ్న భోజన బిల్లులకూ అనుసంధానం చేయాలి. దీనివల్ల రోజువారీగా ఎందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందో తెలిసిపోతుంది. 

⇒ ప్రస్తుతం 1 నుంచి 5 వరకు.. 6 నుంచి 8వ తరగతి వరకు ..9 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి మూడేసి బిల్లులు రూపొందిస్తున్నారు. అలాగే, కోడి గుడ్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేతన బిల్లు.. ఇలా ఆరు బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటి ఆధారంగా ఈ–కుబేర్‌ నుంచి కార్మికులకు బిల్లుల సొమ్ము అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే నెలల తరబడి బిల్లులు పేరుకుపోతు న్నాయి. దీంతో కొందరు వంట సిబ్బంది అప్పులు చేసి భోజనాలు వండిపెడుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లుల తయారీ, చెల్లింపునకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను భోజన బిల్లులకు అనుసంధానిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కలెక్టర్లు నివేదికలో సూచించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)